హైదరాబాద్ : తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. తెలంగాణలో మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. బేగంపేటలోని గ్రాండ్ కాకతీయలో నిర్వహించిన సీఐఐ సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
టీఆర్ఎస్ ఏడున్నరేండ్ల పాలనలో తలసరి ఆదాయం బాగా పెరిగిందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ. 2.78 లక్షలకు చేరిందన్నారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత పెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే అని కేటీఆర్ స్పష్టం చేశారు. 20 ఏండ్ల క్రితం హైదరాబాద్‌లో పెద్దగా కంపెనీలు లేవు. ఇప్పుడు హైదరాబాద్‌లో అనేక ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆవిష్కరణలు, స్టార్టప్‌లను బాగా ప్రోత్సహిస్తుందన్నారు. తెలంగాణలో ఎన్నో స్టార్టప్‌లు వచ్చి విజయవంతంగా నడుస్తున్నాయి. తమ ప్రభుత్వం తెచ్చిన టీఎస్ ఐపాస్ బాగా విజయవంతమైందన్నారు. పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. 500 మీటర్ల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న పరిశ్రమలకు సత్వర అనుమతి ఇస్తున్నామని చెప్పారు.
మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రంతో పాటు చాలా రాష్ట్రాలు కాపీ కొట్టాయని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోనే పూర్తి చేశాం. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను ప్రతి ఎకరాకు అందిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగంలో కూడా తెలంగాణ అభివృద్ధి చెందిందని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయన్నారు. పంజాబ్ కంటే అధికంగా వరి ధాన్యాన్ని పండించామని చెప్పారు. ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి కూడా రైతులకు లబ్ధి చేసే చర్యలు తీసుకోలేదు. కానీ సీఎం కేసీఆర్ వ్యవసాయ పెట్టుబడి కోసం రైతుబంధు కింద సంవత్సరానికి రెండుసార్లు ఎకరాకు రూ. 5 వేల చొప్పున ఇస్తున్నారని తెలిపారు. గత ఏడేండ్లలో రాష్ట్రంలో పచ్చదనాన్ని 24 నుంచి 31 శాతానికి పెంచామని కేటీఆర్ పేర్కొన్నారు.
IT and Industries Minister @KTRTRS addressed the industry leaders at the @FollowCII Telangana State Leadership Summit 2021-22 in Hyderabad. #TriumphantTelangana pic.twitter.com/O1YH9aeNMa
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) March 2, 2022