హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జీ.. ఎన్డీఏ గవర్నమెంట్ బడ్జెట్ 2022ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో.. మీరిచ్చిన హామీలను ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు కేటాయింపులు సమానంగా ఉంటాయని, వాస్తవికతను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉంటుందని ఆశిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
నీతి ఆయోగ్ చెప్పినట్టు మిషన్ కాకతీయకు, భగీరథకు నిధులు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. విభజన చట్టంలోని హామీలన్ని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు మద్దతు ఇవ్వాలి. హామీలు నెరవేరేలా బడ్జెట్ ఉంటుందని ఆశిస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మోదీ ఇచ్చిన హామీని కేటీఆర్ గుర్తు చేశారు. 2022 నాటికి ప్రతి భారతీయుడికి ఇల్లు నిర్మించి ఇస్తామని, ప్రతి ఇంటికి నీరు, విద్యుత్, టాయిలెట్ సదుపాయం కల్పిస్తామని మోదీ ఇచ్చిన హామీలను కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
I would also urge you to support progressive state like Telangana (which is 4th largest contributor to Indian economy) by way of honouring the promises made in AP reorganisation act & recommendations by Niti Ayogto support Mission Bhagiratha & Mission Kakatiya #Budget2022 pic.twitter.com/t4oKZrBl0f
— KTR (@KTRTRS) January 30, 2022