హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మెడికల్ డివైజెస్ రంగాన్ని మరింత పరుగులు పెట్టించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ రంగంలో దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు శనివారం చర్చలు జరిపారు. బయో ఏషియా-2023 సదస్సులో భాగంగా మంత్రి కేటీఆర్ శనివారం ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మెడికల్ డివైజెస్ కంపెనీలకు చెందిన 20 మంది ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితులు, కంపెనీ యాజమాన్యాలు ఏమేం మార్పులు కోరుకొంటున్నాయి, భవిష్యత్తులో ఆవిష్కరణల వేగం పెరగాలంటే ఏం చేయాలి, మెడ్‌టెక్ కంపెనీలు అంతర్జాతీయ స్థాయికి చేరుకోవాలంటే రాష్ట్రంలో ఎలాంటి ఎకో సిస్టం కావాలి, ప్రభుత్వాల తరఫున ఎలాంటి సహాయం కావాలి.. వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
కంపెనీల ప్రతినిధులు అనేక రకాల సలహాలు, సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా పన్నులు, అధిక మొత్తం జీఎస్టీ విధింపు, ముడిపదార్థాల నిల్వలో ఎదుర్కొంటున్న సవాళ్లు వంటివాటిని మంత్రి కేటీఆర్‌కు వివరించారు. దీంతో కంపెనీల అవసరాలను, విన్నపాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విధానపరమైన మార్పులు జరిగేలా చూస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో తెలంగాణలో మెడ్‌టెక్ ఎకో సిస్టం గురించి, సాధించిన విజయాల గురించి, ఇక్కడ ఉన్న అవకాశాల గురించి వివరించారు. మెడ్‌టెక్ రంగం వృద్ధికి తెలంగాణ చేస్తున్న కృషిని కంపెనీల ప్రతినిధులు అభినందించారు.
మిచెల్ బ్లాక్వెల్ –వైస్ ప్రెసిడెంట్ & ఎండీ, మెట్రానిక్ ఇండియా
రాజీవ్ నాథ్ – ఎండీ, హిందూస్థాన్ సిరం జీస్ అండ్ మెడికల్ డివైజెస్
ఆదిత్య బెనర్జీ – ఎండీ, బీ బ్రౌన్ మెడికల్ (ఇండియా)
సుమీత్ భట్ – సీఈవో, ట్రివిట్రాన్ హెల్త్‌కేర్
సుశీర్ అగర్వాల్ – ఎండీ, టెర్మో ఇండియా
భార్గవ్ కొటాడియా – ఎండీ, సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్
సచిన్ గార్గ్ – కో ఫౌండర్ అండ్ డైరెక్టర్, ఇన్నోవేషన్ ఇమేజింగ్ టెక్నాలజీస్
జతిన్ మహాజన్ – ఎండీ, జే మిత్ర అండ్ కో
జీవీఎస్ మాన్యం – ఎండీ, పనసీయా
అభినవ్ ఠాకూర్ – ఎండీ, ఆక్యూరెక్స్ బయోమెడికల్
కిశోర్ ఖన్నా – ఎండీ, రామ్సన్స్
జోస్ పాల్ – ఎండీ, ప్రిమస్
సంజీవ్ రీలన్ – సీఈవో, షాలెక్స్ ఓవర్సీస్
చిరాగ్ జోషీ – సీఈవో, బీకాన్ డయాగ్నోస్టిక్స్
రాజీవ్ ఛబ్రా – ఎండీ, ఏస్ ఆర్థో కేర్
రాజేశ్ తుమ్మర్రు – ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రోమియా థీరప్టీసియస్
కుల్దీప్ రైజాదా – ఫౌండర్ చైర్మన్, ఆకృతి ఆప్తాల్మిక్
టీ ప్రదీప్‌రెడ్డి – సీఈవో, ఆర్కా మెడికల్ డివైజెస్
సుషీర్ కుమార్ మునుపల్లి – ఎండీ, హువెల్ లైఫ్‌సైన్సెస్
ఏవీఎస్ రెడ్డి – ఎండీ, అప్పిడి టెక్నాలజీస్
జాన్ అండర్సన్ – సీఈవో, హర్లాండ్ మెడికల్ సిస్టమ్స్