మంచిర్యాల: పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని మందమర్రి (Mandamarri Municipality), క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో (Kyathanpally Municipality) పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మందమర్రి మండలం శంకర్పల్లి వద్ద రూ.500 కోట్లతో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి (Oil Palm) భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నేతకాని వెంకటేశ్, ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొన్నారు.
అనంతరం భీమారం మండలం పరిధిలోని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.14.53 కోట్లతో నిర్మించే రోడ్లు, బ్రిడ్జిలు, చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో రూ.20.40 కోట్లతో నిర్మించే పది రోడ్ల పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభిచనున్నారు. అనంతరం రూ.11.70 కోట్లతో పాలవాగుపై పులిమడుగు,అందుగులపేట, సండ్రూన్పల్లి దగ్గర మూడు చోట్ల బ్రిడ్జిలు, చెన్నూ ర్ పక్కన అక్కెపెల్లి వాగుపై బ్రిడ్జి కమ్ చెక్ డ్యామ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. మందమర్రి మున్సిపాలిటీలో రూ.204.8 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తర్వాత మందమర్రి మార్కెట్ చౌరస్తాలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు.
Ktr 2