హైదరాబాద్ : ప్రముఖ కవి, రచయిత రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన గంగాడి సుధీర్ రచించిన రెండవ పుస్తకం ‘కవనం’ కవితా సంపుటిని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. నేడు హైదరాబాద్ టిసాట్ ప్రాంగణంలో జరిగిన వేడుకలో ఓయూ, అంబేద్కర్ యూనివర్శిటీ వీసీలు, టిసాట్ సీఈవో శైలేష్ రెడ్డి ఇతర విద్యావేత్తల సమక్షంలో పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్భ మాట్లాడారు. భవిష్యత్తులో గంగాడి సుధీర్ మరిన్ని మంచి రచనలు చేయాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు ఓయూ వీసీ రవిందర్ యాదవ్, అంబేద్కర్ యూనివర్శిటీ వీసీ సీతారామారావ్, టీసాట్ సీఈవో శైలేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.