సిద్దిపేట: మంత్రులు హరీశ్ రావు (Minister Harish Rao), కేటీఆర్ (Minister KTR) సిద్దిపేటలో (Siddipet) పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభిస్తున్నారు. పట్టణ శివారు ఇర్కోడ్‌లో రూ.6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మోడ్రన్ స్లాటర్ హౌస్‌ను, అందులో ఏర్పాటు చేసిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మహిళా ఉత్పత్తులు, ఇర్కోడ్ నాన్‌వెజ్ పచ్చళ్లు, పంచాయతీరాజ్ శాఖ సేంద్రియ ఎరువుల స్టాళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, తదితతలు పాల్గొన్నారు.
అనంతరం సిద్దిపేట పట్టణంలో బీటీ, సీసీ రోడ్లకు, నర్సాపూర్ వద్ద గల కప్పలకుంట సుందరీకరణ పనులకు శకుస్థాపన చేశారు. ఆ తర్వాత నర్సాపూర్‌లో తాగునీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేయనున్నారు. స్వచ్ఛ బడిని సందర్శించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్దిపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న నాగులబండ వద్ద నిర్మించిన ఐటీ టవర్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో మంత్రులు పాల్గొంటారు.

