నారాయణపేట : నారాయణపేట జిల్లాలో రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి నిధులతో నిర్మించిన చిల్డ్రన్స్, సైన్స్ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, సురభి వాణిదేవీ, కలెక్టర్ హరిచందనతో పాటు పలువురు పాల్గొన్నారు.
అంతకుముందు.. నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల ఐసీయూ వార్డును కేటీఆర్ ప్రారంభించారు. సమీకృత మార్కెట్కు, అమరవీరుల స్మారక పార్కుకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ ట్రైనింగ్, టెక్స్టైల్ పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు @SRReddyTRS, @ChittemRRTRS, @PNReddyTRS, @GBalarajuTrs, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, @CNarayanpet @harichandanaias
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 10, 2021
పాల్గొన్నారు. pic.twitter.com/diN1UPRV29
నారాయణపేట జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి నిధులతో నిర్మించిన చిల్డ్రన్స్ పార్కును మంత్రులు @KTRTRS, @VSrinivasGoud, @SingireddyTRS ప్రారంభించారు pic.twitter.com/i7gjZ0hoM7
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 10, 2021