Minister KTR | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మానవత్వానికి చిరునామా. ఆపదలో ఉన్న వారిని క్షణాల్లో ఆదుకునే మనస్తత్వం ఆయన సొంతం. కష్టాల్లో అండగా నిలిచి, నేనున్నాను అని మానసిక స్థైర్యం కల్పించే అపద్బాంధవుడు. అలాంటి గొప్ప నేత కేటీఆర్ మరోసారి మానవత్వం చాటుకున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారాన్ని ముగించుకొని.. కేటీఆర్ హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. అయితే ఓ ఇద్దరు దంపతులు బైక్‌పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ దంపతులను గమనించిన కేటీఆర్ తన కాన్వాయ్‌ను ఆపారు. ఆ తర్వాత కారు దిగిన కేటీఆర్.. నేరుగా ఆ దంపతుల వద్దకు వెళ్లారు. గాయాలతో బాధపడుతున్న వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌కు తన కాన్వాయ్‌లోని ఓ వాహనంలో కేటీఆర్ పంపించారు.