Minister KTR | నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి.. తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరు?: మంత్రి కేటీఆర్
Minister KTR | నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. కరప్షన్‌కు కేరాఫ్ కాంగ్రెస్ (Congress) పార్టీ అని.. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధిస్తున్నారని, ఇక్కడికొచ్చి నీతి వాక్యాలు వల్లెవేస్తున్నారా అని రాహుల్ గాంధీపై (Rahul Gandhi) ఫైర్ అయ్యారు.
Minister KTR | నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. కరప్షన్‌కు కేరాఫ్ కాంగ్రెస్ (Congress) పార్టీ అని.. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధిస్తున్నారని, ఇక్కడికొచ్చి నీతి వాక్యాలు వల్లెవేస్తున్నారా అని రాహుల్ గాంధీపై (Rahul Gandhi) ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ తెలంగాణకు (Telangana) ఎప్పుడూ విలనేనని, గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించినప్పుడే తెలంగాణ కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా దుయ్యబట్టారు. గత పదేండ్లుగా గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరెందుకు మెదపలేదని నిలదీశారు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్ కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదన్నారు.
‘కాంగ్రెస్ బస్సుయాత్ర తుస్సుమనడం ఖాయం. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక. గత పదేళ్ల కాలంలో.. గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్‌కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదు.
కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వందరోజుల్లోనే బొందపెట్టిన పార్టీ మీది. మ్యానిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాది. కర్ణాటకలో రైతులకు ఐదుగంటల కరెంట్ కూడా
ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు మీరు. రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ.. తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన మాది. నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరు..
కరప్షన్ కు కేరాఫ్ కాంగ్రెస్. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధింపులు. ఇక్కడికొచ్చి నీతి వాక్యాలా??. దశాబ్దాలుగా పోడుభూముల సమస్యను కోల్డ్ స్టోరేజీలో పెట్టింది మీరు. ఏకంగా 4.50 లక్షల ఎకరాల భూములు పంచి అడవిబిడ్డలకు పట్టాభిషేకం చేసిన ప్రభుత్వం మాది. శ్రీకాంతాచారిని బలితీసుకున్న కాంగ్రెస్‌కు ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదు. తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే వందల మంది బలిదానాలకు కారణం.
నిన్నఅయినా.. నేడు అయినా.. రేపు అయినా.. తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్. గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించిన నాడే.. తెలంగాణ కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ మీ పీసీసీ చీఫ్. టిక్కెట్ల కోసం కోట్ల సొమ్ముతోపాటు భూములు రాయించుకుంటున్న రాబందు.. రేవంతు..
రిమోట్ పాలన గురించి మీరా మాట్లాడేది..??, రిమోట్ కంట్రోల్ పాలనకు కేరాఫ్ మీ టెన్ జనపథ్.. మా ప్రభుత్వ రిమోట్ తెలంగాణ ప్రజల చేతిలో పదిలంగా ఉంది.. మీ గాంధీభవన్ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతోంది. మూడు రోజుల పర్యటన చేసినా మూడు వందల రోజులు ముక్కు నేలకు రాసినా.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మరు. వైఫల్యాల కాంగ్రెస్ ను ఎప్పటికీ విశ్వసించరు’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ బస్సుయాత్ర…
తుస్సుమనడం ఖాయం…సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ.
చీకటి పాలనకు చిరునామా కర్ణాటక.గత పదేళ్ల కాలంలో..
గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదు.బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదు.
విభజన హామీలపై ఏనాడూ…
— KTR (@KTRBRS) October 19, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

