Minister KTR | తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నర ఏండ్లలో 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, 1,60,083 నియామకాలను పూర్తిచేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఈ లెక తప్పు అని నిరూపించగలరా అని శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. తెలంగాణ కంటే ఎకువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందా? అని నిలదీశారు.
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారం వెలగబెట్టిన పదేండ్లలో (2004-14) తెలంగాణలో భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని? కేవలం 10,116 మాత్రమేనని, ఇదేనా నిరుద్యోగులపై మీ ప్రేమ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదికి సగటున నింపిన సరారు కొలువులు 16,850 అని, కాం గ్రెస్ హయాంలో (2004-14) ఏటా ఇచ్చింది కేవలం 1,012 ఉద్యోగాలు మాత్రమేనని వివరించారు.
ఇదీ కాంగ్రెస్‌కు బీఆర్ఎస్కు ఉన్న తేడా! మీరొచ్చి మాకు సుద్దు లు చెబితే ఎట్లా? అని రాహుల్‌గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. జీవితంలో ఎప్పుడైనా ఉద్యమం చేశావా? ఉద్యోగం చేశావా? యువత ఆశలు, ఆకాంక్షలు తెలుసా? పోటీ పరీక్షలు రాసినవా? ఇంటర్వ్యూకు వెళ్లినవా? ఉద్యోగార్థుల ఇబ్బందులు ఏమన్నా నీకు అర్థమైతయా? రాహుల్ అంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
Ktr