హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. కృష్ణా నదీజాలల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. నదీ జలాల వివాదాల పరిష్కారానికి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, లేదంటే ఇప్పుడున్న ట్రిబ్యునల్-2 (KWDT)కి సంబంధించిన నిబంధనలను సవరించాలనే ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ తిరస్కరించడంపై ట్విట్టర్ వేదికగా ఘాటుగానే స్పందించారు.
‘ఎనిమిదేళ్లు గడుస్తున్నా.. తెలంగాణ రైతులకు కృష్ణా జలాల్లో సరైన వాటా అందించలేని ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్) ప్రభుత్వానికి సిగ్గుండాలి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే రాజకీయాలు చేయకూడదు. వెన్నెముక లేని టీఎస్ బీజేపీ ఈ అన్యాయానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తుందా..? లేదా?’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కేటీఆర్ ట్వీట్‌పై రాష్ట్ర నేతలు, నెటిజన్లు స్పందించారు.
Shame on NPA Govt that cannot deliver rightful share in Krishna waters to #Telangana farmers even after 8 years
Politics should not be at the cost of compromising the interests of the state. Will the spineless TS-BJP raise their voice against Injustice? https://t.co/8UuJneUmfg
— KTR (@KTRTRS) April 24, 2022
’తెలంగాణ విషయంలో భారత ప్రభుత్వానికి ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు..? వాళ్లు చేసిన వాగ్ధానాల అమలులో ఎప్పుడో విఫలమయ్యారని, అర్థం లేని మాటలు మాట్లాడే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి విషయాలను మాట్లాడే దమ్ము ఎందుకు లేదు? లేదంటూ మండిపడ్డారు. సిగ్గులేని బీజీపీ.. దమ్ములేని నాయకులు.. రాష్ట్ర సమస్యలపై మాట్లాడని బీజేపీ రాష్ట్రానికి పట్టిన శని’ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.