Minister KTR | హైదరాబాద్ : ఒక మాఫియాను నడిపించినట్టే మీడియా( Media )ను నడిపిస్తున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
జర్నలిస్టులు, మీడియా సంస్థలంటే మాకు గౌరవం ఉందని కేటీఆర్ తెలిపారు. కానీ మీడియా యాజమాన్యాల గొంతు నులిమి పట్టుకుని ఈడీ( ED ), సీబీఐ( CBI ) కేసులు పెడుతున్నారు. వారు మాత్రం ఏం చేయగలరు. మన రాష్ట్రంల కూడా ఆంధ్రప్రభ( Andhra Prabha ) మీద కేసులు పెట్టారు. ఎవర్నీ వదిలిపెట్టడం లేదు. మీకు ధైర్యం లేకపోవచ్చు.. మాకుంది. వాస్తవాలు చూపించే సత్తా మీకు లేకపోవచ్చు.. మాకుంది. తప్పకుండా వాస్తవాలు చూపెడుతాం. వంద శాతం వీరిని నగ్నంగా ప్రజల ముందు నిలబెట్టే బాధ్యత మాది అని కేటీఆర్ స్పష్టం చేశారు.
మద్య నిషేధం ఉన్న గుజరాత్( Gujarat )లో లిక్కర్ తాగి 42 మంది చనిపోయారు. అది స్కామా.. స్కీమా.. ఏమంటావు.. అది మోదీ స్కీమా..? అది మీ వీ6( V6 )లో చూపించావా..? వీ6లో ఏం మాట్లాడుతారో తెలుసు.. ఏం చూపెడుతారో తెలుసు.. ఏం డ్రామాలో చేస్తారో తెలుసు.. మిమ్మల్ని ఎప్పుడు బ్యాన్ చేయాలో కూడా మాకు తెలుసు. వంద శాతం చెబుతున్నా. బీజేపీ మౌత్ పీసెస్( BJP Mouth Pieces ) లాగా ఉన్న చిల్లర సంస్థలు రాష్ట్రంలో ఏవైతో ఉన్నాయో.. వాటిని ప్రజల ముందు ఎండగడుతాం. అది వెలుగా.. వీ6.. ఇంకోటా కాదు.. మరి నమస్తే తెలంగాణ( Namasthe Telangana ), తెలంగాణ టుడే( Telangana Today ) అనే దినపత్రికలను బీజేపీ ఆఫీసు( BJP Office )లో బ్యాన్ చేశారు. దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు. అది అప్రజాస్వామికం కాదా..? పత్రికలు ఈ దేశంలో ఎవరు ఆడించినట్టు ఆడుతున్నాయని కేటీఆర్ నిలదీశారు.
మోదీ( Modi ) మీద శ్రీలంక( Srilanka ) ఆరోపణ చేస్తే ఒక్క పత్రికనైనా రాసిందా..? ఒక్క మీడియా సంస్థనైనా..? ఎందుకు ధైర్యం చేయలేకపోయిందని కేటీఆర్ ప్రశ్నించారు. ఎందుకో తెలుసు.. మీ బాధను మేం అర్థం చేసుకోగలుగుతాం. బీబీసీ మీదనే దాడి చేసినోడు.. మిమ్మల్ని వదిలిపెడుతాడా.. మీరెంత ఆయనకు. చాలా మందిని ఆయన కొనేశాడు. ఎన్డీటీవీ( NDTV )ని ఎవరు కొన్నారు.. గౌతమ్ అదానీ. మిగతా సంస్థలు ఎవరి చేతిలో ఉన్నాయని కేటీఆర్ ప్రశ్నించారు.