కేంద్రం వైఖరితో ఆదిలాబాద్ యువతకు తీరని ద్రోహం: మంత్రి కేటీఆర్
Minister KTR| ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యూనిట్ పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు.

హైదరాబాద్: ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యూనిట్ పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణలోనేకాదు దేశీయంగా కూడా సిమెంటుకు భారీ డిమాండ్ ఉందన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, మహేంద్రనాథ్ పాండేలకు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. దేశంలోని ప్రైవేటు సిమెంటు కంపెనీలు భారీ లాభాలు ఆర్జిస్తున్నాయని చెప్పారు. సీసీఐ కంపెనీ పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని అందులో పేర్కొన్నారు. కంపెనీని ప్రారంభిస్తామంటే ప్రోత్సాహకాలు, వెసులుబాటు కల్పిస్తామన్నారు. ఈవిషయమై ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని కలిసి విజ్ఞప్తి చేశామని, అటునుంది ఇప్పటివరకు ఎలాంటి స్పందనా లేదని చెప్పారు.
టీఎస్ ఐపాస్ ద్వారా తాము భారీగా పెట్టుబడులు తెస్తున్నామని వెల్లడించారు. తాము ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తుంటే.. కేంద్రం మాత్రం సీసీఐ లాంటి కంపెనీలను తెరవకుండా ఉపాధి అవకాశాలను దెబ్బ కొడుతున్నదని విమర్శించారు. కేంద్రం మొండి వైఖరితో ఆదిలాబాద్ యువతకు తీరని ద్రోహం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీసీఐ తెరిస్తే ఆదిలాబాద్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కంపెనీ పునఃప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.
👉 ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్‌ను తిరిగి తెరిచేందుకు ఎన్నో సానుకూల అంశాలు, అవకాశాలు ఉన్నాయి
— BRS Party (@BRSparty) January 2, 2022
👉 తెలంగాణలోనే కాదు దేశీయంగా కూడా సిమెంట్‌కు భారీ డిమాండ్ ఉంది
👉 దేశంలోని ప్రైవేట్ సిమెంట్ కంపెనీలు భారీ లాభాలు ఆర్జిస్తున్నాయి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

