ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి కన్నుమూత.. మంత్రి కేటీఆర్ సంతాపం
ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతిచెందారు. 32 ఏండ్ల స్వామి.. ప్రమాదవశాత్తు బైక్‌పైనుంచి పడి చనిపోయారు. నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన స్వామి చిన్నతనంలోనే
నల్లగొండ: ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి కన్నుమూశారు. 32 ఏండ్ల స్వామి.. ప్రమాదవశాత్తు బైక్‌పైనుంచి పడి చనిపోయారు. నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన స్వామి చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ బారినపడ్డారు. ఫ్లోరైడ్ రక్కసిని తరమికొట్టాలని అవిశ్రాంతంగా పోరాడారు. ఫ్లోరైడ్ బాధితుల తరపున గళం వినిపించారు. కాగా, శుక్రవారం సాయంత్రం తన ఇంటివద్ద ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి స్వామి కిందపడిపోయారు. దీంతో మెడకు గాయమవడంతో స్థానికంగానే చికిత్స చేయించుకున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.

అంశాల స్వామి మృతిపట్ల మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘ఫ్లోరోసిస్ బాధితుడైన స్వామి ఫ్లోరైడ్ సమస్యపై అవిశ్రాంతంగా పోరాడారు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తి. ఎప్పటికీ తన మనసులో గుర్తుండిపోతాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్వీట్ చేశారు.
My Heartfelt condolences to the family of Sri Amshala Swamy Garu who passed away today
He was a fighter who championed the cause of Fluorosis victims & an inspiration to many. He will always remain close to my heart
May his soul rest in peace 🙏 pic.twitter.com/wCv5DHWeGg
— KTR (@KTRBRS) January 28, 2023
గతేడాది అక్టోబర్ 13న మంత్రి కేటీఆర్ అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. ఆయనతో కలిసి భోజనం చేశారు. స్వయంగా స్వామికి అన్నం వడ్డించారు. మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల సందర్భంగా చండూరు వెళ్లిన మంత్రి కేటీఆర్.. ఆ తర్వాత శివన్నగూడెంలోని స్వామి ఇంటికి వెళ్లారు. ఆయన తల్లితండ్రుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం స్వామి ఇంట్లోనే కేటీఆర్ భోజనం చేశారు. స్వామి యోగక్షేమాలు, ఇంటి నిర్మాణం, హెయిర్ కటింగ్ సెలూన్ గురించి ఆరా తీశారు. స్వామి కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటానని భరోసా కల్పించారు. గతంలో అంశాల స్వామి పరిస్థితి తెలుసుకొని వ్యక్తిగతంగా కేటీఆర్ ఆర్థిక సహాయం అందించారు. దాంతో పాటు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూం కోసం రూ.5.50లక్షలు మంజూరు చేయించారు. మిగతా ఇంటి నిర్మాణ పనులను కార్యాలయంతో పర్యవేక్షించి, పూర్తి చేసేలా చొరవ చూపారు. మంత్రి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ సీనియర్ నేత కర్నాటి విద్యాసాగర్‌రావు ఇంటి నిర్మాణ పనులను పర్యవేక్షించారు.
మునుగోడు నియోజకవర్గం శివన్నగూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంట్లో భోజనం చేసిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. pic.twitter.com/ZvYMGL6W27
— Namasthe Telangana (@ntdailyonline) October 13, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

