హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ అమ్మాయి తన బర్త్డే వేడుకలను వినూత్నంగా నిర్వహించుకునేందుకు సిద్ధమైంది. భవిష్యత్ తరాలకు పచ్చని అడవులను, స్వచ్ఛమైన గాలిని అందించాలనే సంకల్పంతో.. తన 8వ పుట్టిన రోజున 65 వేల విత్తన బంతులను అడవిలో నాటాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆ అమ్మాయికి కేటీఆర్ అభినందనలు తెలుపుతూ ఆశీర్వదించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన ప్రకృతి ప్రకాశ్ పర్యావరణంపై తన కూతురు బ్లెస్సీకి అవగాహన కల్పిస్తున్నాడు. అయితే జనవరి 31న తన 8వ పుట్టిన రోజు సందర్భంగా 65 వేల విత్తన బంతులను అడవిలో నాటాలని బ్లెస్సీ డిసైడ్ అయింది. దీంతో 65 వేల విత్తన బంతులను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది.
ఈ సందర్భంగా బ్లెస్సీ మాట్లాడుతూ.. ఇవాళ మనం స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నాం, బతకగలుగుతున్నాం అంటే కేవలం చెట్ల వల్లే. తాను బయటకు వెళ్లినప్పుడల్లా రాలిపడ్డ విత్తనాలను సేకరించి ఇంటికి తీసుకొస్తున్నాను. దీన్ని చూసి తన ఫ్రెండ్స్ నవ్వారు. కానీ వారికి చెట్లను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించిన తర్వాత అర్థం చేసుకున్నారు అని బ్లెస్సీ తెలిపింది. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి, పర్యావరణ సమతుల్యతను కాపాడాలని బ్లెస్సీ కోరింది.
Bless you Blessy 👍: With 65,000 Seeds, Sircilla Girl Sets Out On Path To Plant A Green Future | Hyderabad News – Times of India https://t.co/lju8qzHcJL
— KTR (@KTRTRS) January 30, 2022