సిరిసిల్ల: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కేటీఆర్ (KTR) తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 1324 మంది ఓటర్లు ఉన్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
మంచిర్యాల జెడ్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే దివాకర్ రావు ఓటు వేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, పటాన్‌చెరూలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.