తొర్రూరు, మార్చి 8 : సీనియర్ వేధింపులతో మనోవేదనకులోనై ఇటీవల కాకతీయ మెడికల్ కళాశాలలో ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ తనువు చాలించిన జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాకు చెందిన వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి కుటుంబ సభ్యులను బుధవారం తొర్రూరులోని ఆర్అండ్బీ అతిథి గృహంలో మంత్రి కేటీఆర్ పరామర్శించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్తో కలిసి ప్రీతి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆమె చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. అక్కడి నుంచే వరంగల్ సీపీ సీ రంగనాథ్తో ఫోన్లో మాట్లాడి కేసు పురోగతి, దర్యాప్తు తీరును అడిగి తెలుసుకున్నారు.