హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కని ఆశావహులకు వేరే విధంగా ప్రజాసేవ చేసే అవకాశం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. క్రిశాంక్ సహా పలువురు సామర్థ్యం గల నాయకులకు పోటీచేసే అవకాశం కల్పించలేకపోవడం దురదృష్టకరమని ఆయన సోమవారం ట్వీట్ చేశారు. అయినా నిరుత్సాహానికి గురికాకుండా ప్రజా జీవితంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. టికెట్లు పొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పిన కేటీఆర్.. తనకు మళ్లీ సిరిసిల్ల నుంచి పోటీచేసేందుకు అవకాశం కల్పించిన పార్టీ అధినేత కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.