Minister KTR | కాంగ్రెస్ నాయకులపై ఈడీ విచారణ ఎందుకు జరగడం లేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలోని, రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదో ప్రజలు ఆలోచించాలని సూచించారు. అలాగే రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా బీజేపీ మీద ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. మోదీపై ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకంత భయమని అడిగారు.
తెల్లారిలేస్తే కేసీఆర్ మీద మొరిగేవాళ్లు.. ఒక్కరు కూడా బీజేపీపై ఎందుకు మాట్లాడటం లేదని.. గొంతులేసుకుని కేసీఆర్ మీద ఎందుకు పడిపోతారని మంత్రి కేటీఆర్ నిలదీశారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీపై ఈడీ విచారణ ఎందుకు ఆగిందని.. దీని గురించి ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. తాము తప్పు చేసి ఉంటే దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు.