హైదరాబాద్ : ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ర్ట ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది పర్వదినాన ప్రజలంతా ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు వారు ట్వీట్ చేశారు.
ఈ ప్లవ నామ సంవత్సరంలో అన్ని విధాలా శుభం కలగాలని కోరుకుంటూ, మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు!
— KTR (@KTRTRS) April 13, 2021
మీకు, మీ కుటుంబ సభ్యులకు 'ప్లవ' నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినాన ప్రజలంతా ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను#ఉగాది
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 13, 2021