సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన మంత్రి కొప్పుల
Minister Koppula Eshwar | గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని గురువారం రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం సందర్శించారు. హైదరాబాద్ నగరం హుస్సేన్ సాగర్ తీరంలో దేశంలో ఎక్కడా లేని విధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ 125 అడుగుల
హైదరాబాద్ : గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని గురువారం రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం సందర్శించారు. హైదరాబాద్ నగరం హుస్సేన్ సాగర్ తీరంలో దేశంలో ఎక్కడా లేని విధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రి కొప్పుల సుప్రసిద్ధ వ్యక్తుల విగ్రహాలను తయారు చేస్తున్న స్టూడియోలను పరిశీలించేందుకు ఢిల్లీ, గుజరాత్లో పర్యటిస్తున్నారు.
ఇందులో భాగంగా గుజరాత్లో సర్ధార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించేందుకు గుజరాత్‌కు పర్యటించారు. అలాగే జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్రోద్యమ కాలంలో సబర్మతి నదీ తీరాన ఉన్న ఆశ్రమంలో సుమారు 12 సంవత్సరాలు పాటు నివసించిన విషయం తెలిసిందే. ఆశ్రమంలో గాంధీజీ వడికిన రాట్నం, నడయాడిన ప్రాంతాన్ని కొప్పుల సందర్శించారు. ఈ సందర్భంగా గాంధీకి నివాళులర్పించారు. ఆశ్రమ నిర్వాహకులు మంత్రికి సాదర స్వాగతం పలికి అక్కడి చరిత్ర, విశేషాలను వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

