జగిత్యాల : ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో స్పీడు పెంచింది. పొద్దున లేచింది మొదలు ఇల్లిల్లూ తిరుగుతూ స్థానికులతో మమేకమవుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. చేసిన అభివృద్ధి, చేయబోయే పనులను వివిరించి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ప్రచారంలో భాగంగా మంగళవారం ధర్మపురి(Dharmapuri) బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula )తనదైన రీతిలో దూసుకెళ్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి మంగళవారం ఉదయమే గడపగడపకు తిరుగూతూ ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనకు గల తేడాలను వివరిస్తూ..మళ్లీ గెలిస్తే ప్రజలకు చేయబోయే పనులను వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ప్రచారానికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావడంతో ధర్మపురి పట్టణం గులాబీమయమైంది.
