Minister Koppula | తెలంగాణలో రైతు, ప్రజా సంక్షేమ ప్రభుత్వం : మంత్రి కొప్పుల
Minister Koppula | తెలంగాణ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని మరే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేపట్టలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) వెల్లడించారు
జగిత్యాల : తెలంగాణ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని మరే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేపట్టలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) వెల్లడించారు. మంగళవారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గాదెపల్లి, తీగలధర్మారం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు, ప్రజా సంక్షేమ ప్రభుత్వం సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వంలో కొనసాగుతుందని వెల్లడించారు. రైతులకు సాగునీరు, రైతు బంధు(Raitu Bandu), రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, కల్యాణ లక్ష్మి(Kalyana Laxmi ), కేసీఆర్ కిట్, రూ. 2016 పెన్షన్, రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లలకు సన్నబియ్యం తో పోషకాహార భోజనం లాంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని ప్రశ్నించారు.
నూతన వ్యవసాయ చట్టం వల్ల రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. రైతాంగాన్ని అన్ని ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకువస్తే రాష్ట్రభవిష్యత్ మారిపోతుందన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతులకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. నకిలీ విత్తనాలు, గుర్తింపు లేని పురుగుల మందులు విక్రయిస్తున్న వ్యాపారస్తుల పై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.
పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ బృహత్తర కార్యక్రమాలు చేపడుతుంటే వాటిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు చేస్తున్న కుటిల యత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

