ధర్మపురి : పార్టీకి మూలస్తంభాలైన కార్యకర్తలు బాధ్యతయుతంగా పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ( Minister Koppula ) పేర్కొన్నారు. ధర్మపురి నియోజకవర్గ గ్రామ శాఖ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘ సభ్యులు, మండలాల కార్యవర్గ సభ్యులు, పార్టీ అధ్యక్షులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. అన్ని గ్రామాల్లో అనుబంధ శాఖలను బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ( Welfare Schemes ) ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని సూచించారు. విపక్షాలు చేసే కుట్రలను తిప్పి కొట్టాలని కోరారు. సీఎం కేసీఆర్ (CM KCR ) ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతం పై దృష్టి సారించాలన్నారు. పదవుల కోసం అనేక అవకాశాలు వస్తాయని, పార్టీ అభివృద్ధికి పాటు పడాలని సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడంలేదన్న విషయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు రైతుబంధు (Raitu Bandu ), దళిత బంధు, పెన్షన్లు. కేసీఆర్ కిట్టు వంటివి ప్రజలు మర్చిపోకుండా ఉండేలా గుర్తు చేయాల్సిన అవసరం పార్టీ శ్రేణుల పై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని అన్నారు.