హైదరాబాద్: క్రైస్తవ సోదరులకు ముఖ్యమైన పండగ క్రిస్మస్ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు జన్మించిన ఈ శుభ దినాన అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో అన్ని పండగలను వైభవంగా నిర్వహిస్తున్నామని, ప్రతి మతాన్ని సమానంగా చూస్తున్నారని తెలిపారు. సర్వమత సౌభ్రాతృత్వంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచానికి శాంతిని అందజేశాయని వెల్లడించారు. ఈ క్రిస్మస్ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నింపాలని, ఇంటింటా ఆనందపు కాంతులు వెల్లివిరియాలని మంత్రి కొప్పుల అభిలషించారు.