Singareni | సింగరేణి కార్మికుల సమ్మెకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సంఘీభావం
Singareni | సింగరేణి సంస్థకు చెందిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. వీటిని వేలం వేయొద్దని సింగరేణి కార్మికులు సమ్మెకు దిగారు.

భూపాలపల్లి: సింగరేణి సంస్థకు చెందిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. వీటిని వేలం వేయొద్దని సింగరేణి కార్మికులు సమ్మెకు దిగారు. ఈ సమ్మెకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంఘీభావం తెలిపారు. ఆయనతోపాటు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్, రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కూడా ఈ సమ్మెకు సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు.
శుక్రవారం సాయంత్రం సింగరేణి జీడీకే 2 గనిని వీరంతా సందర్శించారు. ఈ సందర్భంగానే సమ్మెకు మద్దతు తెలుపుతూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కాగా, బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా చేపట్టిన సింగరేణి సమ్మె.. శుక్రవారం నాడు రెండో రోజుకు చేరింది. సంస్థలోని అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెకు మద్దతు ప్రకటించడంతో కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో నాలుగు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది.
40 కోట్ల రూపాయలు కార్మికుల వేతనాలకు నష్టం వాటిల్లింది. సింగరేణిలో 4 బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో మూడు రోజులపాటు సమ్మెకు జేఏసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pochampally Srinivas Reddy : దేశ రాజకీయాలను శాసించి తెలంగాణను సాధించిన మహానేత కేసీఆర్
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

