హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర టీవి, చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనిల్ కూర్మాచలంకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందజేశారు.
మాసబ్ ట్యాంక్‌లోని సమాచార,పౌర సంబంధాల శాఖ కార్యాలయంలోని తన ఛాంబర్లో అనిల్ ఆదివారం వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అనిల్‌కు మంత్రి కొప్పుల ఈశ్వర్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిజం చేస్తూ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.