కరీమాబాద్, మే 2: రైతులు తీసుకొస్తున్న మక్కలు కొనుగోలు చేసి ఎక్కడ పెట్టాలో తెలియడం లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం గ్రేటర్ వరంగల్ శివనగర్‌లో నిర్వహించిన ‘ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. టీవీల వల్ల రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిందని పేర్కొన్నారు. పలు కార్యక్రమాలను చూసి నేరాలు చేస్తున్నారని, చివరకు దొరికి జైలు జీవితం అనుభవిస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ర్టాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నదని, మన దగ్గర లేదని చెప్పారు.