జనగామ : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్తో కలిసి బీఎస్పీ పొత్తుపెట్టుకోవడం ఇష్టంలేని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RSPraveen kumar) రౌడీ రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించడం ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం కలిగించింది.
గురువారం జనగామ జిల్లా కేంద్రంలో మంత్రి కొండా సురేఖ బహిరంగ క్షమాపణ(Public apology) చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ నాయకులు ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మరో మంత్రి సీతక్క కాన్వాయ్కి ఎదురుగా వెళ్లి ప్లకార్డులతో నిరసన తెలిపారు. మంత్రి సీతక్క వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని తోసివేశారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు చంద్రశేఖర్, శ్రీశైలం మాట్లాడుతూ.. గూండా రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న కొండా సురేఖ దంపతులు, మేధావి వర్గానికి చెందిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి సురేఖ క్షమాపణ చెప్పే వరకు బీఎస్పీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. w కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు మహేందర్, రాజు, మల్లయ్య, కృష్ణ, పవన్, మారయ్య, రాజు పాల్గొన్నారు.