హైదరాబాద్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కన్సల్టెంట్ సంస్థ మెయిన్హార్ట్పై పాకిస్తాన్లో కేసులు ఉన్నాయనే అంశంపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. శనివారం సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. తప్పులు చేస్తే ఏ కంపెనీపై అయినా కేసులు పడతాయని పేర్కొన్నారు. డీపీఆర్ సిద్ధమయ్యాకే మూసీ ప్రాజెక్టు ఖర్చుతేలుతుందని చెప్పారు. కన్సల్టెంట్ సంస్థకు 140కోట్లతో ఆర్డర్ ఇచ్చామ ని, ఏడాదిన్నరలో నివేదిక అందుతుందని తెలిపారు. మూసీ వెంబడి నివసిస్తున్న 10వేల మందిని తరలిస్తున్నామని, వారికి డబుల్ బెడ్రూమ్ ఇంటితోపాటు రూ. 25వేల చొప్పున ఇస్తున్నట్టు తెలిపారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును అడ్డుకుంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఇళ్లను ముట్టడిస్తామని తెలిపారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. అసలు మూసీ ఎక్కడుందో కూడా కిషన్‌రెడ్డికి తెల్వదని ఎద్దేవా చేశారు.
అక్రమ రిజిస్ట్రేషన్..తహసీల్దార్ రిమాండ్
చందుర్తి, అక్టోబర్ 19:ఒకరి భూమి ని మరొకరికి రిజిస్ట్రేషన్ చేసిన నాటి చందుర్తి తహసీల్దార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లికి చెందిన సలేంద్ర మల్లేశానికి 1.20 ఎకరాల భూమి ఉన్నది. అదే గ్రామానికి చెందిన సలేంద్ర లక్ష్మి, సలేంద్ర వేణు కలిసి అప్పటి తహసీల్దార్ డీ నరేశ్ సాయంతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు సీఐ చెప్పారు. నరేశ్ చందుర్తి తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో తప్పుడు డాక్యుమెంట్లతో భూమిని సలేంద్ర లక్ష్మి, వేణు పేరిట పట్టా మార్పిడి చేసినట్టు తేలిందని పేర్కొన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్లో పనిచేస్తున్న నరేశ్‌ను శనివా రం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు.