నల్లగొండ: నల్లగొండ పట్టణంలో బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఈద్గాలో ముస్లింసోదరులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ ప్రార్థనల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Minister Komatireddy Venkatreddy) పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. బక్రీద్ అంటే త్యాగాలకు ప్రతీక అన్నారు. నల్లగొండ పట్టణంలో గత 30 ఏండ్లుగా హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అన్నదమ్ములుగా కలిసి ఉంటున్నారని చెప్పారు. పేద ముస్లింలకు ఇండ్లు కట్టిస్తామని తెలిపారు. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఈద్గాను అభివృద్ధి చేస్తామన్నారు.
ముస్లింలకు విద్యారంగంలో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో చదువుకున్న ముస్లి యువతకు అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. అంతా బాగుండాలని అల్లాను ప్రార్ధించానని చెప్పారు. పటిష్ట బందోబస్తుతో శాంతియుతంగా ప్రార్థనలు జరిగేలా చూసిన పోలీసు శాఖను అభినందించారు.