హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): రజాకార్లు, సీమాంధ్రులతో పోరాడినట్టే, మూసీ వ్యతిరేకులతో నల్లగొండ ప్రజలు పోరాడాల్సి వస్తదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ మురుగు కారణంగా నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజలు నరకయాతన పడుతున్నారన్నా రు. నల్లగొండ జిల్లా పోరాటాల గడ్డ అని, రజాకార్లు, సీ మాంధ్రులతో పోరాడినట్టే నల్లగొండ ప్రజలంతా పోరాటం చేసే రోజు దగ్గర్లోనే ఉన్నదని పేర్కొన్నారు. మంగళవారం ఆయన జూబ్లీహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుతో నల్లగొండ సహా మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజల ఇబ్బందులు తీరిపోతాయని పేర్కొన్నారు.
గతంలోనే సరిహద్దులు..
గతంలోనే మూసీకి సరిహద్దులు నిర్ధారించారని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2021లో అప్పటి సీఎం సమావేశాలు నిర్ణయించి, మూసీకి 50మీటర్ల దూరంలో బఫర్‌జోన్‌ను నిర్ణయించారని తెలిపారు.