హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెట్రేగిపోతున్న డ్రగ్స్, అక్రమ మద్యం, సారా అమ్మకాల వంటి నేరవ్యవస్థ మూలాల్లోకి వెళ్లి నియంత్రణకు కృషిచేయాలని సిబ్బందికి ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీని మంత్రి జూపల్లి కృష్ణారావు తనిఖీ చేశారు. అకాడమీలో ఆయా విభాగాల పనితీరును తెలుసుకున్నారు. 129 మంది మహిళా ట్రైనీ కానిస్టేబుళ్లతో సంభాషించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ, అబారీ శాఖ డైరెక్టర్ చెవ్వూరు హరికిరణ్, అకాడమీ డైరెక్టర్ అజయ్రావు పాల్గొన్నారు.