వనపర్తి, జవనరి 14: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి యాసంగి పంట చివరి తడికి నీళ్లు అందించాలని, అందుకు అవసరమైన నీటిని రామన్పాడ్ జలాశయం(Ramanpad project) నుంచి విడుదల చేయాలని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. యాసంగి పంటకు సరిపడా నీరులేక పంటలు ఎండిపోతున్నాయని, కనీసం చివరి తడికైనా నీటిని విడుదల చేయాలని పలువురు రైతులు మంత్రి దృష్టికి తెచ్చారు.
ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రి రామన్పాడ్ ప్రాజెక్ట్ను సందర్శించి, జలాశయంలో నీటి లభ్యతపై నీటిపారుద శాఖ అధికారులను ఆరా తీశారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా, పంట చివరి తడికి సాగు నీరందేలా సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ సత్యశీల రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.