సూర్యాపేట : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని, వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తుందని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని ఇందిరమ్మ కాలనీలో.. అనారోగ్యంతో మృతి చెందిన బీఆర్ఎస్ నాయకుడు తెలంగాణ రియాజ్ మాతృమూర్తి సౌరబీ ప్రయాజ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న మంత్రి
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అధైర్య పడొద్దని అండగా ఉంటామని భరోసానిచ్చారు. అంతకుముందు క్యాంపు కార్యాలయంలో ప్రజల వినతులను స్వీకరించి సమస్యలను పరిష్కరించారు. పెండింగ్ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట బీఆర్ఎస్ నాయకులు కడారి సతీష్ యాదవ్, గంగ లింగారెడ్డి ,స్వామి తదితరులు ఉన్నారు.