హైదరాబాద్ : రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి జన్మదినం నేడు. 58 వసంతాలు పూర్తి చేసుకుని 59వ ఒడిలోకి అడుగిడారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి జగదీశ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వేరు వేరుగా మంత్రి జగదీష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, మంత్రి జగదీశ్‌రెడ్డి తన పుట్టినరోజును పురస్కరించుకొని గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు.. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో తన సతీమణి సునితతో కలసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు యాదవ్, రామచంద్ర నాయక్, అనిల్ కుర్మాచలం, రాజీవ్ సాగర్, పల్లె రవికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.