సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత వల్లే అన్నం పెట్టే రైతులకు, ఆశీర్వదించే అర్చకులకు ఆదరణ పెరిగిందని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ( Minister Jagdish reddy ) అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లా దీప, దూప నైవేద్యం అర్చక సమాఖ్య ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
రైతులకు ( Farmers ), అర్చకులకు (Priests ) రాష్ట్రం ఏర్పడక ముందు, ప్రస్తుతం ఉన్న ఆదరణలో మార్పులను గమనించాలని కోరారు. రైతులు, అర్చకులు తమ వృత్తులను బిడియా పడే రోజుల నుంచి తలెత్తుకుని చెప్పుకునే స్థాయికి తెలంగాణ సమాజం చేరుకుందన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) రూపొందించిన ప్రణాళికలే కారణమన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై అర్చకుల ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని కోరారు.
బ్రాహ్మణ కార్పొరేషన్ ( Corporation) ను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దీప దూప నైవేద్యం పేరుతో గౌరవ వేతనాన్ని అందించారని కొనియాడారు. కేసీఆర్ నేతృత్వంలోనే 24 గంటల నిరంతర విద్యుత్ నందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించిందన్నారు. ఈ కార్యక్రమానికి అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ అధ్యక్షత వహించారు. పోతులపాటి రామలింగేశ్వర శర్మ, శ్రీరంగం గోపికృష్ణ మాచార్యులు, హరికిషన్ శర్మ, లక్ష్మీనరసయ్య, అన్నంబొట్ల ఫణికుమార్ శర్మ , ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.