సూర్యాపేట : పట్టుదలకు ప్రేమను జోడించి చేసే ప్రతిపనిలో అద్భుతాలు సాధించవచ్చు అని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని పద్మశాలి భవన్లో పద్మశాలీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, ప్రతిభా పురస్కార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. వివిధ రంసీపీఓ గూడా వెంకటేశ్వర్లు, కృష్ణమోహన్, న్యాయవాది కిరణ్ కుమార్, పెంటి సుదర్శన్‌ను మంత్రి సన్మానించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ..కష్టపడకుండా ఏదీ రాదు. వచ్చినా నిలబడదన్నారు. తోటి వారికి సహాయ పడటం అనేది గొప్ప విషయం అని పేర్కొన్నారు. పన్‌కు స్థలాన్ని ఖారారు చేసి శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులంతా, పట్టుదలతో కష్టపడి చదివి తమ తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తేవాలని సూచించారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా పట్టుదలతో చేసే పనిలో విజయం చేకూరుతుందన్నారు.
పట్టుదలతో మల్లేష్ తయారు చేసిన ఆసు యంత్రం, తన తల్లి పడే కష్టంతో పాటు సమాజంలో ఎంతో మంది తల్లుల కష్టాలను తీర్చిందన్నారు. పట్టుదలతో చేసిన పని వల్లే మల్లేష్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. మల్లేష్ విజయం నేటి యువతకు స్ఫూర్తి అన్న మంత్రి ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ పేరుమాల అన్నపూర్ణ , బీఆర్ యస్ రాష్ట్ర నాయకుడు గండూరి ప్రకాష్, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, పెండెం చంద్రశేఖర్, వార్డు కౌన్సిలర్ గండూరి పావని, పెండెం వెంకటేశ్వర్లు, పెండెం పాండు, తదితరులు హాజరయ్యారు.