సూర్యాపేట : జిల్లాలోని నాగారం మండలం ఫణిగిరి, అనంతారం గ్రామాలలో వివిధ కారణాలతో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల కుటుంబాలను విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గురువారం పరామర్శించారు. ఉద్యమకారుడు, బీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ కల్లట్లపల్లి శోభన్ బాబు తండ్రి రాములు అనారోగ్యంతో మృతి చెందడంతో.. శోభన్ స్వగ్రామం నాగారం మండలం ఫణిగిరిలో రాములు భౌతిక కాయానికి మంత్రి పూల మాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
అలాగే అనంతారం గ్రామ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కట్ల నాగార్జున సతీమణి కట్ల నాగమ్మ భౌతికదేహనికి పూల మాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనిత, సర్పంచ్ బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ మామిడి రేవతి, సింగిల్ విండో చైర్మన్ నాతాల జానకిరామ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు దొంగరి యుగంధర్,ఉప్పల ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.
కట్ల నాగమ్మ భౌతికదేహనికి నివాళులు అర్పిస్తున్న మంత్రి