సూర్యాపేట, జూలై 8 (నమస్తే తెలంగాణ): వరంగల్ సభలో మోదీ మాటల్లో అబద్ధాలు, తెలంగాణపై అక్కసు వెళ్లగక్కడం తప్ప మరేదీ కానరాలేదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. మోదీ అబద్ధాలను తెలంగాణ ప్రజలు నమ్మరని, అందుకే తొమ్మిదేండ్లలో ఇక్కడి ప్రజలు బీజేపీ స్థానం ఇవ్వలేదని చెప్పారు. విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొస్తానని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన మోదీ..
ఆ ధనం ఎవరికి పంచారని నిలదీశారు. అభివృద్ధి గిట్టని ప్రధాని మోదీ కాంగ్రెస్ పాలనలో ఉన్న అవినీతిని కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మోదీ తొమ్మిదేండ్ల పాలనలో దేశంలో మతాలతో మంటల చిచ్చు.. ప్రతిపక్షాలను మింగివేయడం తప్ప మరేమీ చేయలేదని విమర్శించారు.