యాదాద్రి భువనగిరి : వలిగొండ మండల పరిధిలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభంగా జరుగుతున్నాయి. బుధవారం మంత్రి జగదీష్ రెడ్డి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అంజేశారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.