సూర్యాపేట, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వం ఆవశ్యకత ఉన్నద ని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. అక్కడి పాలనా వైఫల్యం వల్లే రాయలసీమ నేతలు రాయల తెలంగాణ అంటూ కొ త్త పల్లవి అందుకున్నారని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ర్టాల ప్రజలు తమను తెలంగాణలో కలుపాలని, లేదంటే తెలంగాణ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు.
అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో మొదలైందని వివరించారు. సూర్యాపేట నియోజవర్గ స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయల తెలంగాణ కోరడానికి కారణం తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకుపోవడమేనని అన్నారు. తెలంగాణ చుట్టూ ఉన్న రాష్ర్టాల ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో కలుపాలని కోరడం ఇక్కడి అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.