Minister Jagadish Reddy | అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సూర్యాపేట కలెక్టరేట్లో అభివృద్ధి పనుల పురోగతిపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలాన్ని తక్షణమే అరులైన వారికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గృహలక్ష్మి దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేయాలని కోరారు.
జీవో 59 పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించి పట్టాలు అందజేయాలని సూచించారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో సీసీ రహదారులు, ఆధునికీకరణ పనులు వారం లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ పనులను యుద్ద ప్రాతిపాదికన పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఆర్అండ్బీ, ఇరిగేషన్ డివిజన్ అధికారులు పాల్గొన్నారు.