హైదరాబా ద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ అంటే నే ఢిల్లీ పెద్దలకు వణుకు మొదలైందని.. తన పర్యటనలో తెలంగాణపై మోదీ విద్వేషపు ప్రసంగం చేశారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మా ట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిని చూసి మోదీ తట్టుకోలేక పోతున్నారని మండిపడ్డారు. ప్రసంగం ఆసాంతం మోసపూరితంగా సాగిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుండగా, బీజేపీ పాలనలో దేశం అవినీతిమయంగా మారిందని అన్నారు.