Minister Jagadish Reddy | కాంగ్రెస్ లాగా మాది కాగితాల గ్యారంటీ కాదు.. కేసీఆర్ నోటి మాటే గ్యారంటీ : మంత్రి జగదీష్ రెడ్డి
Minister Jagadish Reddy | ప్రజలకు బాండ్ పేపర్లు రాసిస్తూ మభ్యపెడుతున్న కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే ఎన్నికల కమిషన్‌కి బాండ్ రాసివ్వాలని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీశ్ రెడ్డి(Minister Jagadish Reddy )సవాల్ విసిరారు. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. కాంగ్రెస్ 6 గ్యారంటీల(Six Guarantees) పై నమ్మకంలేక 42 పేజీల గ్యారంటీని తెచ్చారనీ ఏద్దేవా చేశారు.
సూర్యాపేట : ప్రజలకు బాండ్ పేపర్లు రాసిస్తూ మభ్యపెడుతున్న కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే ఎన్నికల కమిషన్‌కి బాండ్ రాసివ్వాలని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీశ్ రెడ్డి(Minister Jagadish Reddy )సవాల్ విసిరారు. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. కాంగ్రెస్ 6 గ్యారంటీల(Six Guarantees) పై నమ్మకంలేక 42 పేజీల గ్యారంటీని తెచ్చారనీ ఏద్దేవా చేశారు. దాన్ని కూడా ప్రజలు నమ్మడంలేదని బాండ్ పేపర్లు రాసిస్తూ కొత్త డ్రామా ఆడుతున్నారన్నారు. హామీలు అమలు చేయకపోతే తమ ప్రభుత్వాన్ని రద్దు చేయమని బాండ్ ఇవ్వాలి అని సవాల్ విసిరారు.
ఇలాంటి బాండ్లు కర్ణాటకలో కూడా రాసిచ్చి పత్తాలేకుండా పోయి మొహం చాటేశారని విమర్శించారు. హామీలు అమలు చేయమని కర్ణాటకలో రైతులు వెంటబడితే పారిపోయారన్నారు. కర్ణాటక తరహాలో తెలంగాణాలో సైతం ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గ్యారంటీ బాండ్ రాసివ్వమని ప్రజలు అడగడంలేదు. కేసీఆర్ లాంటి నమ్మకమైన వ్యక్తి చెబితే చాలు అంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ లాగా మాది కాగితాల గ్యారంటీ కాదు కేసీఆర్ నోటి మాటే గ్యారంటీ అన్నారు. నోటి మాట గ్యారంటీ లేక కాగితాల గ్యారంటీ ఇస్తున్నా ప్రజలు కాంగ్రెస్ ను విశ్వసించరని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

