నిర్మల్, జనవరి 28 : హై కోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి తండ్రి విద్యాసాగర్ రెడ్డి (న్యాయవాది) పార్థీవదేహానికి న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు.
ప్రియదర్శిని నగర్ – సాగర్ కాలనీలోని ఆయన నివాసంలో విద్యాసాగర్ రెడ్డి పార్థీవదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
విద్యాసాగర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారికి భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు.