Minister Indrakaran reddy | భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
భద్రాచల (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రమూర్తిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) దర్శించుకున్నారు. సతీసమేతంగా భద్రాద్రి ఆలయానికి చేరుకున్న మంత్రి.. ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
భద్రాద్రి: భద్రాచల (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రమూర్తిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) దర్శించుకున్నారు. సతీసమేతంగా భద్రాద్రి ఆలయానికి చేరుకున్న మంత్రి.. ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు. ఆ తర్వాత భక్తులకు తాగునీటి కోసం ఏర్పాటు చేసిన జలప్రసాదాన్ని (ఆర్వో ప్లాంట్) మంత్రి ప్రారంభించారు. అంతకుము ఆలయం వద్ద మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతంపలికారు.
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో రాములోరి కల్యాణ క్రతువులో ఆ మూడు రోజులే కీలక ఘట్టాలు. అలాంటి మధుర ఘట్టాలను తిలకించడానికి తెలంగాణ సర్కారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 30న జరగనున్న రామయ్య కల్యాణానికి వేదికను ముస్తాబు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు రాములోరి కల్యాణాన్ని తిలకించేందుకు తరలి రానున్నారు.
భద్రాచలంలో మూడు రోజులు !
- 29వ తేదీ బుధవారం ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటల వరకు సర్వదర్శనం, శీఘ్ర దర్శనం. సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ఆరాధన, 5:30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు సర్వదర్శనం, శీఘ్ర దర్శనం, 7 నుంచి 10 గంటల వరకు ఎదుర్కోలు ఉత్సవం, గరుడసేవ, 10 నుంచి 10:30 గంటల వరకు ఆరగింపు, నివేదన శాత్తుమురై, ఆలయం తలుపులు మూసివేత.
- 30 వతేదీన గురువారం రాములోరి కల్యాణం నిర్వహిస్తారు. ఉదయం 2 గంటలకు ఆలయం తలుపులు తీస్తారు. 2 నుంచి 2:30 గంటల వరకు సుప్రభాత సేవ, 2:30 నుంచి 4 గంటల వరకు తిరువారాధన నివేదన, శాత్తుమురై, 4 నుంచి 5 గంటల వరకు మూలవరులకు అభిషేకం, 5 నుంచి 5:30 గంటలకు వరకు అలంకారం, 5:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సర్వదర్శనం, శీఘ్ర దర్శనం, 8 నుంచి 9 గంటల వరకు శ్రీస్వామివారికి ధ్రువమూర్తుల తిరుకల్యాణం, 9 నుంచి 9:30 గంటలకు ఉత్సవ మూర్తులకు అలంకారం, 9:30 నుంచి 10:30 గంటల వరకు శ్రీసీతారామ ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా కల్యాణ మంటపానికి తీసుకెళ్తారు. 10:30 నుంచి 12:30 గంటల వరకు కల్యాణ మంటపంలో సీతారాముల తిరుకల్యాణం. మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట వరకు ఉత్సవ మూర్తులను కల్యాణ మంటపం నుంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొస్తారు. 1 నుంచి 2 గంటల వరకు మధ్యాహ్నిక ఆరాధన, రాజభోగం, 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వదర్శనం, శీఘ్ర దర్శనం ఉంటుంది. సాయంత్రం.. 6 నుంచి 6:30 గంటల వరకు ఆరాధన, 6 నుంచి 7:30 గంటల వరకు శ్రీరామ పునర్వసు దీక్షాధారణ, సాయంత్రం 6:30 నుంచి 10:30 గంటల వరకు సర్వదర్శనం, శీఘ్ర దర్శనం, 8 నుంచి 10 గంటల వరకు తిరువీధి సేవ, చంద్రప్రభ వాహనం, 6 నుంచి 6:30 గంటల వరకు నివేదన శాత్తుమురై, రాత్రి 10:30 గంటలకు ఆలయం తలుపులు వేస్తారు.
- 31వ తేదీన శుక్రవారం సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 4 నుంచి 4:30 గంటలకు తలుపులు తీస్తారు. సుప్రభావత సేవ, 4 నుంచి 6:30 గంటలకు ఆరాధన, నివేదన, శాత్తుమురై, 6 నుంచి 9:30 గంటల వరకు సర్వదర్శనం, 9:30 నుంచి 10:30 గంటల వరకు శ్రీసీతారామ ఉత్సవ మూర్తులకు ఆలయం నుంచి ఊరేగింపు, కల్యాణ మంటపానికి తీసుకెళ్తారు. 10:30 నుంచి 12:30 గంటల వరకు మహాపట్టాభిషేకం, మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు ఉత్సవ మూర్తులను కల్యాణ మంటపం నుంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు మధ్యాహ్నిక ఆరాధన, రాజభోగం, తలుపులు వేస్తారు. 3 నుంచి 6 గంటల వరకు సర్వదర్శనం, శీఘ్ర దర్శనం ఉంటుంది. సాయంత్రం 6 నుంచి 6.:30 గంటల వరకు ఆరాధన, 6.30 నుంచి 9:30 గంటల వరకు సర్వదర్శనం, 7 నుంచి 9:30 గంటల 10:30 ఆరగింపు, శాత్తుమురై, తలుపులు వేస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

