Nirmal | పోలీస్ కమాండ్ కంట్రోల్‌ను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
Nirmal | నిర్మల్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్‌ను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
Nirmal | నిర్మల్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్‌ను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. అంతకు ముందు ఠాణా ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. దేశంలోనే అతిపెద్ద కమాండ్ కంట్రోల్‌ను సీఎం కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో దొంగతనాలకు ఆస్కారం లేదన్నారు.
ఇటీవల నిర్మల్ చుట్టుపక్కల ఓ బ్యాంకులో దొంగతనం జరిగితే పోలీసులు ఐదు రోజుల్లో ఛేజ్ చేశారన్నారు. పట్టణంలో ఏం అనర్థాలు జరుగుతున్నాయో, సీసీ కెమెరాలతో పోలీసులకు వెంటనే తెలిసిపోతాయన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా ఉండి పోలీసులకు సహకరించాలని సూచించారు. అనుమాదాస్పద వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, బీఆర్ఎస్ నాయకులు అల్లోల గౌతమ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు మల్లేశ్, శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ దేవేందర్, రాజశేఖర్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

