నిర్మల్, సెప్టెంబర్ 17: తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు పగటి కలలుకంటున్నారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు పెట్టినా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో చోటే లేదని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చీరిచింతకు కట్టడం ఖాయమని తెలిపారు. రోజుకోమాట మార్చే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. సోనియాను రేవంత్‌రెడ్డి ఒకప్పుడు బలిదేవత అన్నారని, ఇప్పుడేమో దేవత అంటున్నారని విమర్శించారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో కర్ణాటకలో గద్దెనెక్కిన కాంగ్రెస్.. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు.