నిర్మల్ : దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నిర్మల్ పట్టణం శాంతినగర్ చౌరస్తాలో చేపట్టిన పీవీ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విగ్రహ నిర్మాణ పనులు నాణ్యత విషయంలో రాజీ పడకుండా సకాలంలో పూర్తి చేయాలన్నారు. విగ్రహ నిర్మాణానికి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.